తెలంగాణ ప్రజానీకం లోక్ సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్య

తెలంగాణ ప్రజానీకం లోక్ సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్య

తెలంగాణ ప్రజానీకం లోక్ సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్య

రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదని... కానీ తాము అద్భుత విజయాలు దక్కించుకున్నామన్నారు. నరేంద్రమోదీని మూడోసారి ప్రధానిగా భారతదేశంతో పాటు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రజానీకం లోక్ సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తోందన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి డిసెంబర్ 23న కొంగర సమీపంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతున్నట్లు తెలిపారు. ఎన్నికల కోసం 90 రోజుల కార్యాచరణను సిద్ధం చేసినట్లు తెలిపారు.