యాడ్ ఆన్ క్రెడిట్ కార్డులు

యాడ్ ఆన్ క్రెడిట్ కార్డులు

యాడ్ ఆన్ క్రెడిట్ కార్డులు

క్రెడిట్ కార్డు జారీలో బ్యాంకర్లు ప్రధానంగా చూసే విషయం కస్టమర్ ఆదాయం.. నికరమైన ఆదాయం ఉండి క్రెడిట్ స్కోరు బాగుంటే మేమంటే మేమిస్తామంటూ బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఉద్యోగస్తుడికి ఇచ్చినంత ఈజీగా హౌస్ వైఫ్ లకు, విద్యార్థులకు బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేయవు. వారికి ఆదాయ మార్గం లేకపోవడమే దీనికి కారణమని చెప్పొచ్చు. అయితే, దీనికి బ్యాంకర్లు కల్పిస్తున్న మినహాయింపే ‘యాడ్ ఆన్ క్రెడిట్ కార్డు’. కుటుంబంలో ఒకరు క్రెడిట్ కార్డు వాడుతూ, చెల్లింపుల హిస్టరీ మెరుగ్గా నిర్వహిస్తుంటే వారి ఇంట్లో మిగతా సభ్యులకు ఈ కార్డును జారీ చేస్తాయి. ప్రైమరీ కార్డుతో పొందే రివార్డులు, రాయితీలను యాడ్ ఆన్ కార్డుతోనూ పొందొచ్చు. అయితే, దీని చెల్లింపుల బాధ్యతంతా ప్రైమరీ కార్డు హోల్డర్ పైనే ఉంటుందని బ్యాంకర్లు చెబుతున్నారు.

ఇవీ ప్రయోజనాలు..

  • క్రెడిట్ కార్డు పొందే అర్హతలేకున్నా ఈ కార్డు అందుకోవచ్చు
  • ఇంట్లో నిత్యావసరాలు, అత్యవసర ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు
  • కుటుంబ సభ్యుల క్రెడిట్‌ హిస్టరీ మెరుగు పడుతుంది
  • కొన్ని కొన్ని బ్యాంకులు ప్రైమరీ కార్డుల క్రెడిట్ పరిమితి పెంచుతాయి
  • అధిక రివార్డు పాయింట్లను ఆఫర్ చేసే అవకాశం కూడా ఉంది
  • యాడ్‌-ఆన్‌ కార్డులతో చేస్తున్న ఖర్చులను పర్యవేక్షించే వెసులుబాటు


నష్టాలు..

  • కొత్తగా చేతికి వచ్చిన కార్డు వల్ల ఇంట్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది
  • బిల్లు సకాలంలో చెల్లించకపోతే వడ్డీ తడిసిమోపెడవుతుంది
  • కార్డు దుర్వినియోగం చేస్తే ప్రైమరీ కార్డు హోల్డర్ పై దుష్ప్రభావం
  • బకాయిలు, ఎగవేతలు నమోదైతే రుణ అర్హతలను దెబ్బతీస్తుంది
  • కొన్ని బ్యాంకులు యాడ్ ఆన్ కార్డులపై ప్రత్యేక రుసుము విధిస్తున్నాయి