'ఆహా' సెంటర్లో 'కరీంనగర్స్' మూవీ!
'ఆహా' సెంటర్లో 'కరీంనగర్స్' మూవీ!
'ఆహా' ఓటీటీ సెంటర్ కి వచ్చిన 'మా ఊరిపొలిమేర 2' సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఆయా తరువాత వచ్చిన 'రాక్షస కావ్యం' సినిమా కూడా సందేశం పరంగా మంచి మార్కులనే కొట్టేసింది. ఇక ఇప్పుడు ఇదే ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి 'కరీంనగర్స్' సినిమా రెడీ అవుతోంది. మోస్ట్ వాంటెడ్ అనేది ట్యాగ్ లైన్.
ఈ సినిమా 'ఆహా'లో ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ను కూడా వదిలారు. కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలను రమేశ్ ఎలిగేటి సమకూర్చగా, బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించాడు. సాహిత్య సాగర్ సంగీతాన్ని అందించాడు.ఒక వైపున రాజకీయం .. మరో వైపున రౌడీయిజం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. కరీంనగర్ కి చెందిన నలుగురు యువకులు ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు?. ఆ ప్రయాణంలో వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది ఈ సినిమాలోని ప్రధానమైన అంశం.