సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డీఎస్పీ నళిని
సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డీఎస్పీ నళిని
మాజీ డీఎస్పీ నళిని శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... నళిని పేరును ప్రస్తావించారు.
పోలీసు అధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... తెలంగాణ కోసం ఉద్యోగం వదులుకున్న నళినికి తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని లేదంటే అదే స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. కానీ తాను ప్రస్తుతం పూర్తి ఆధ్యాత్మిక చింతనతో ఉన్నానని.. తాను ఫిట్ కూడా కాదని.. అందుకే ఉద్యోగాన్ని తిరస్కరిస్తున్నట్లు నళిని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రిని ఆమె కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ శనివారం ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ రోడ్డులో కనిపించింది. ఈ రోజు మధ్యాహ్నం 11.45 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబీఆర్ పార్క్ రోడ్డు మీదుగా వెళ్తున్నారు. ఆ సమయంలో అంబులెన్స్ రావడంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ దారి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులపై అధికారులకు కీలక సూచనలు చేశారు. తాను వస్తున్నానని చెప్పి ప్రజలను గంటలకొద్దీ ఆపివేయవద్దని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. తన రాకకు కొద్దిసేపు ముందు నిలిపివేస్తే చాలని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ప్రజల మన్ననలు చూరగొన్నారు. ఇప్పుడు అంబులెన్స్‌కు దారి ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.