లీఫ్​ ఇయర్ అంటే ఏంటి?..

లీఫ్​ ఇయర్ అంటే ఏంటి?..

లీఫ్​ ఇయర్ అంటే ఏంటి?..

కోటి ఆశలతో అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. కుటుంబం, స్నేహితులు, సన్నిహితులతో కలిసి సంతోషంగా 2024 సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పండుగ చేసుకున్నారు. 2024 వ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది.  2024  లీఫ్‌ సంవత్సరం. మీరు తీసుకున్న రిజల్యూషన్స్, కలలు నెరవేర్చుకోవడం కోసం మరొక రోజు అదనంగా కలిసి వచ్చింది. లీప్ ఇయర్ అంటే 365 రోజులకి బదులుగా 366 రోజులు వస్తాయని అందరికీ తెలుసు. కానీ నిజానికి 366 రోజులు ఎందుకు వచ్చాయో తెలుసా?

ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీఫ్‌ సంవత్సరం వస్తుంది. అంటే క్యాలెండర్ లో ఫిబ్రవరి నెలకి 28 రోజులకి బదులుగా 29 వస్తాయి. ఈ విధంగా 2024 లో 366 రోజులు వచ్చాయి. ఫిబ్రవరిలో వచ్చే అదనపు రోజుని లీప్ సంవత్సరం అంటారు.

నాలుగేళ్లకు ఒకరోజు ఎక్స్‌ట్రా

అసలు ఈ ఎక్స్‌ట్రా డే ఫిబ్రవరిలో ఎందుకు వస్తుందబ్బా అన్నది అందరి డౌట్‌. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని.. అందుకు ఏడాది పడిపడుతుందని మనం చదువుకునే ఉంటాం. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి కరెక్ట్‌గా చెప్పాలంటే… 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్ల సమయం పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే 365రోజులకు తోడు మరో పావురోజు పడుతుందన్నమాట. ఆ పావురోజును ఒకరోజుగా తీసుకోలేం. కాబట్టి ప్రతీ నాలుగేళ్లలో నాలుగు పావురోజుల్ని కలిపి.. ఒక రోజుగా మార్చి.. లీఫ్‌ ఇయర్‌లో ఫిబ్రవరి నెలలో ఒకరోజును అదనంగా చేర్చుతారు.  ఫిబ్రవరిలో తక్కువ రోజులు ఉండటంతో అదనంగా వచ్చిన ఒక రోజుని ఆ నెలలో పెట్టారు. అందుకే ఫిబ్రవరిలో 28 రోజులకి బదులు 29 రోజులు వచ్చాయి. ఈ అదనపు రోజు కలపకపోతే రుతువుల్లో మార్పులు వస్తాయి. వేసవి కాలం మధ్యలో శీతాకాలం వచ్చే అవకాశం ఉంటుంది. నాలుగేళ్లకి ఒకసారి ఫిబ్రవరిలో 29 రోజులు వచ్చే విధంగా గ్రెగెరియన్ క్యాలెండర్ లో రూపొందించారు.

నాలుగేళ్లకోసారి వస్తోన్న లీఫ్​ సంవత్సరం

ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. అదే లీపు ఇయర్‌ అయితే… ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. లీఫ్‌ ఇయర్‌ అనేది నాలుగేళ్లకోసారి వస్తుంది. ఈరోజు పుట్టిన వారికి నాలుగేళ్లకోసారి బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ జరపుకుంటారు. ఇక ఈరోజు పెళ్లి చేసుకున్న వారు కూడా అంతే.. వారి మ్యారేజ్‌ యానివర్సరీ నాలుగేళ్లకు వస్తుందన్నమాట.

ఫిబ్రవరిలో ఎక్స్​ ట్రా డే ఎందుకు


మనకు ఇక్కడ ఇంకో డౌట్‌ వస్తుంది. ఫిబ్రవరిలోనే అదనపు రోజును ఎందుకు కలుపుతారని. ఫిబ్రవరిలో 28 రోజులే ఉన్నాయికాబట్టి… లీప్‌ సంవత్సరంలో వచ్చే ఎక్స్‌ట్రా డేను యాడ్‌  చేస్తారు. మరి ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకున్నాయన్న  డౌట్‌ కూడా వస్తుంది. దీనికో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ ఉంది.  

365 రోజులు కేలండర్‌ జూలియస్‌ కాసర్‌ సృష్టి

క్రీస్తు పూర్వం గ్రీస్, రోమన్‌లు… కేలండర్‌లో రోజుల్నీ, నెలలనూ ఇష్టమొచ్చినట్లు మార్చేసేవాళ్లు. రోమ్‌ చక్రవర్తిగా జూలియస్ కాసర్ బాధ్యతలు స్వీకరించేటప్పటికి రోమన్ క్యాలెండర్‌‌లో ఏడాదికి 355 రోజులే ఉండేవి. ప్రతీ రెండేళ్లకూ 22 రోజులు ఉన్న ఒక నెల అదనంగా చేరేది. ఆయన ఎంటరయ్యాక… కేలండర్‌లో చాలా మార్పులు చేశారు. తద్వారా 365 రోజుల కేలండర్ వచ్చింది. అలాగే… ప్రతీ నాలుగేళ్లకూ అదనపు రోజును… ఆగస్టు నెలలో కలిపారు. ఫలితంగా అప్పట్లో ఫిబ్రవరికి 30 రోజులు, జులైకి 31 రోజులు, ఆగస్టుకు 29 రోజులు వచ్చాయి.

ఫిబ్రవరిలో రెండు రోజులు తగ్గింపు

జూలియస్ కాసర్ తర్వాత కాసర్ ఆగస్టస్… చక్రవర్తి అయ్యాడు. ఆయన పుట్టింది ఆగస్టులో. తాను పుట్టిన నెలలో రోజులు తక్కువగా ఉండటాన్ని ఇష్టపడలేదు. ఆగస్టు నెలకు 2 రోజులు పెంచుకున్నాడు. జూలియస్ కాసర్ ఫిబ్రవరిలో పుట్టాడు కాబట్టి… ఫిబ్రవరిలో ఆ రెండు రోజులూ తగ్గించాడు. ఫలితంగా ఆగస్టుకి 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులూ వచ్చాయి. అప్పటి నుంచీ లీపు సంవత్సరంలో 1 రోజును ఆగస్టుకి కాకుండా… ఫిబ్రవరికి కలపడం మొదలుపెట్టారు. ఫిబ్రవరిలో 28 రోజులు ఉండటానికి ఇదీ కారణం. 

లీఫ్​ సంవత్సరం గురించి ఇతర వివరాలు

  • లీఫ్​ సంవత్సరాల సంప్రదాయం పురాతన రోమ్ నాటిది,  జూలియస్ సీజర్ 46 BCలో జూలియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. ఈ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయి.  వాటిని 1582లో  సరిచేసి  ప్రస్తుతం వాడే  గ్రెగోరియన్ క్యాలెండర్ రూపొందించారు.

  • లీఫ్ సంవత్సరాలు కొన్ని ఆసక్తికరమైన సంప్రదాయాలకు దారితీశాయి. ఐర్లాండ్‌లో, లీప్ డే రోజు మాత్రమే   స్త్రీలు..  పురుషులకు కాని.. పురుషులు .. స్త్రీలకు  ప్రపోజ్ చేయడం అదృష్టంగా భావిస్తారు.  మిగతా రోజుల్లో ప్రపోజ్​ చేయడం దురదృష్టంగా భావిస్తారు.

  •  గ్రీస్‌లో, కార్డులు ఆడటం .. జూదం ఆడటం లీఫ్ సంవత్సరం అంటే ఫిబ్రవరి 29న నిషేధించబడింది.

  • ఫిబ్రవరి 29న జన్మించిన కొంతమంది అల్లరి పిల్లలు, ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తమ పుట్టినరోజులను అసలు తేదీన జరుపుకుంటారు. మరికొందరు లీఫ్ సంవత్సరాలలో ఫిబ్రవరి 28 లేదా మార్చి 1న జరుపుకోవాలని ఎంచుకుంటారు.

  • కొంతమంది లీఫ్ డే రోజున వివాహాలు లేదా శస్త్రచికిత్సలు వంటి ముఖ్యమైన జీవిత సంఘటనలను షెడ్యూల్ చేస్తారు, ఇది ప్రత్యేక అదృష్టాన్ని లేదా ప్రాముఖ్యతను తెస్తుందని నమ్ముతారు.

  • కాబట్టి, 2024 లీఫ్ఇయర్  క్యాలెండర్‌లో ఫిబ్రవరి 29న స్నేహితులు ..  కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకోండి.  ఆరోజు గుర్తుండిపోయేలా కొన్ని మంచి పనులు చేయండి.  మళ్లీ నాలుగేళ్లకు కదా ఇలాంటి రోజు వచ్చేది .