అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మేరీల్యాండ్‌లో ప్రదర్శన
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మేరీల్యాండ్‌లో ప్రదర్శన
అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని వాషింగ్టన్ శివారులో హిందూ సంఘాలు ఆదివారం కార్లు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహించాయి. వందలాది మంది కాషాయ జెండాలు పట్టుకుని, జై శ్రీరాం నినాదాలతో వీధుల్లో ర్యాలీ తీశారు. అనంతరం మేరీల్యాండ్ దగ్గరలోని ‘అయోధ్య వే’లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద సమావేశమయ్యారు.
విశ్వహిందూ పరిషత్ వాషింగ్టన్ అధ్యక్షుడు మహేంద్ర సాపా మాట్లాడారు. ఆయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించే రోజున వాషింగ్టన్లో ఉంటున్న వెయ్యి హిందూ కుటుంబాలతో చారిత్రక వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు. అమెరికాలో పుట్టిన పిల్లలకు అర్థమయ్యే రీతిలో శ్రీరాముడి జీవితం గురించి 45 నిమిషాల ప్రదర్శన నిర్వహిస్తామని మహేంద్ర తెలిపారు. ర్యాలీ నిర్వహణ కార్యక్రమాన్ని కృష్ణ గుడిపాటి చేపట్టగా, కో ఆర్గనైజర్ ప్రేమ్‌కుమార్ స్వామినాథన్ తమిళంలోని శ్రీరాముడి పాటలు పాడారు.