బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన మీనా .. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా క్రేజ్
బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన మీనా .. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా క్రేజ్
వెండితెరకి బాలతారలుగా పరిచయమై .. ఆ తరువాత కాలంలో హీరోయిన్స్ గా ఎదిగిన చాలా తక్కువ మందిలో మీనా ఒకరు. తెలుగు .. తమిళ భాషల్లోని స్టార్ హీరోలతో ఆమె నటించారు. వివాహమైన తరువాతనే ఆమె సినిమాల సంఖ్యను తగ్గించుకున్నారు. ఆ తరువాత నిదానంగా రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తన స్థాయికి తగిన పాత్రలను చేస్తూ వెళుతోంది.
తాజాగా ఐ డ్రీమ్స్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ .. "అప్పట్లో రచయితలు నన్ను ఊహించుకుని పాత్రలను రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను కూడా గ్లామర్ రోల్స్ చేశాను .. కాకపోతే అవి కంఫర్ట్ లెవెల్స్ దాటేవి కాదు. గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేసేవారి విషయంలో కాస్త ఎక్కువ హడావిడి కనిపించేది. అలాంటప్పుడు నాకు కూడా ఆ తరహా పాత్రలు చేయాలనిపించేది" అని అన్నారు.
" నా సమయంలో రోజా .. రమ్యకృష్ణ .. రంభ కూడా చాలా బిజీ. వాళ్లలో రోజాతో నాకు ఎక్కువగా పోటీ నడిచేది. డేట్స్ లేని కారణంగా నేను వదులుకున్న సినిమాలు తను, ఆమె వదిలేసిన సినిమాలు నేను చేస్తూ ఉండేవాళ్లం. ఇప్పటికీ వాళ్లందరితో నాకు మంచి స్నేహం ఉంది. నాకు ముందు నుంచి ఉన్న సీనియర్ హీరోయిన్స్ తోను స్నేహం కొనసాగుతూ ఉండటం నా అదృష్టం" అని చెప్పారు.
అప్పుడు అలా .. ఇప్పుడు ఇలా
తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీనా తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " నాకు .. మా వారు విద్యాసాగర్ కి మధ్య గొడవలు జరుగుతున్నట్టుగా పుట్టించారు. మా వాళ్లు కాల్ చేసి మరీ ఆ విషయాన్ని గురించి అడిగారు. నిజానికి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్లం" అని చెప్పారు.
"విద్యాసాగర్ కి లంగ్స్ ట్రాన్స్ ప్లాంట్ అవసరమైంది. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. విదేశాలకి తీసుకుని వెళదామని కూడా అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్లినా వెయిటింగ్ తప్పదన్నారు. ఇదిగో వచ్చేస్తుంది .. అదిగో దొరికేస్తుంది అనే ఆశతోనే ఉన్నాము. ఈ లోగా జరగరానిది జరిగిపోయింది. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను" అని అన్నారు.
"విద్యాసాగర్ చనిపోయి కొన్ని నెలలు గడవగానే, నేను రెండో పెళ్లి చేసుకోనున్నట్టుగా రాశారు. హీరో ధనుశ్ తో పెళ్లి అంటూ ప్రచారం చేశారు. ఒక రాజకీయనాయకుడితో .. సీనియర్ స్టార్ తో .. బిజినెస్ మేన్ తో ఇలా .. ఎవరితో పడితే వాళ్లతో నా పెళ్లి అన్నట్టుగా రాశారు. నిజమో .. కాదో తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం కరెక్టు కాదు. ఈ ప్రచారాల వలన నా ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అయింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.