రవితేజతో హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్'..హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే పరిచయం
రవితేజతో హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్'..హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే పరిచయం
టాలీవుడ్ కి ఈ ఏడాదిలో చాలామంది కథానాయికలు పరిచయమయ్యారు. అయితే వాళ్లలో ఒకరిద్దరికి మాత్రమే హిట్లు పడ్డాయి. ఫస్టు సినిమాతో ఫ్లాప్ ను అందుకున్నవారిలో, రెండో అవకాశాన్ని అందుకున్నవారు కూడా ఒకరిద్దరే ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది .. ఆ బ్యూటీ పేరే 'భాగ్యశ్రీ బోర్సే'.
రవితేజ హీరోగా హరీశ్ శంకర్ 'మిస్టర్ బచ్చన్' సినిమాను రూపొందిస్తున్నాడు. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పరిచయం చేస్తూ, భాగ్యశ్రీ బోర్సే పోస్టర్ ను వదలగా, చీరకట్టులోని ఈ సుందరిని చూసి కుర్రాళ్లంతా పొలోమంటూ మనసులు పారేసుకున్నారు.
భాగ్యశ్రీ బోర్సే పూణెకి చెందిన మోడల్. ఇటీవలే ఆమె 'యారియన్ 2' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు రవితేజ సరసన టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. చక్కని కనుముక్కుతీరుతో .. ఆకర్షణీయమైన రూపంతో కట్టిపడేస్తున్న ఈ బ్యూటీకి, ఇక ఆఫర్లు వెల్లువెత్తే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.