లోక్ సభలో 34 మంది ఎంపీల సస్పెన్షన్
లోక్ సభలో 34 మంది ఎంపీల సస్పెన్షన్
లోక్‌సభలో 34 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరితో సహా 34 మందిని ఈ శీతాకాల సమావేశాల నుంచి లోక్‌సభ స్పీకర్ సస్పెండ్ చేశారు.
పార్లమెంటు భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యులు ఆందోళనలు చేశారు. ఆందోళనలు చేసిన 34 మంది ఎంపీలపై వేటు వేశారు. సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని సస్పెండ్ చేశారు.
పార్లమెంట్‌లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభలు సోమవారం (డిసెంబర్ 18న) దద్దరిల్లుతున్నాయి. విపక్షాల ఆందోళనతో సోమవారం కూడా సభా కార్యకలాపాలు స్తంభించాయి. ఈ క్రమంలోనే లోక్‌సభలో ఆందోళన చేస్తున్న 34 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్ మరోసారి సస్పెన్షన్ వేటు వేశారు.