.ఓ చిన్నపాటి నగరం..
.ఓ చిన్నపాటి నగరం..
అద్భుత దృశ్యం, ఆహ్లాదకరమైన వాతావరణం అభివృద్ధి చెందుతున్న సామాజిక ఆర్థిక కమ్యూనిటీ స్ఫూర్తితో వాస్తుపరంగా ప్రత్యేకమైన అపార్టుమెంట్లతో నివసించాలని మనలోచాలా మంది కలలు కంటుంటారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో అలాంటి దానినే చూపిస్తుంది. చైనాలోని హంజ్ జౌలోని రీజెంట్ ఇంటర్నేషనల్ భవనం, 20వేల మంది నివస్తున్న ఈ భవనం ఓ చిన్న నగరాన్ని తలపిస్తుంది.
ఆధునిక వాస్తు శిల్పానికి నిలువెత్తు నిదర్శనమైన ఈ ఎత్తయిన నిర్మాణం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకు నిలయంగా మారింది. ఇక్కడ అన్ని రకాల మనుషులు జీవనం కొనసాగిస్తున్నారు. ఉన్నోడు లేనోడు అనే బేధం లేకుండా ఈ భవనంలో 20 వేల మంది నివాసం ఉంటున్నారు.
S ఆకారంలో ఉండే ఈ భవనంలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. భవనంలో ఉన్నవాల్లే అన్ని తమకు కావాల్సినవి ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. తయారు చేసే వాళ్లు వారే.. అమ్మేవాళ్లు వారే.. కొనేవారే వాళ్లు వారే అన్నమాట. ఈ భవనంలో లేని సౌకర్యం అంటూ లేదు. ఇంటర్నెట్, షాపింగ్ మాల్స్, కిరాణా దుకాణాలు ఇలా మనిషికి కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
రీజెంట్ ఇంటర్నేషనల్ భవనంలో పట్టణ జీవనానికి వినూత్న విధానం, నివాస, వాణిజ్య, వినోద ప్రదేశాలను ఈ భవనంలో ఏర్పాటు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.