బ్యాంక్ ఆఫ్ బరోడాకు భారీ జరిమానా వడ్డించిన ఆర్బీఐ
బ్యాంక్ ఆఫ్ బరోడాకు భారీ జరిమానా వడ్డించిన ఆర్బీఐ
చిరిగిన నోట్లను బ్యాంకుల్లో తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో చిరిగిన నోట్లకు సంబంధించిన లావాదేవీల్లో భారీ తేడాను గుర్తించారు. దాంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంక్ ఆఫ్ బరోడాకు రూ.5 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. అంతేకాదు, చిరిగిన నోట్లలో నకిలీ నోట్లు కనిపించడంతో మరో రూ.2,750 అదనపు జరిమానా విధించింది. ఈ మేరకు తాజా ఎక్చేంజ్ ఫైలింగ్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. నవంబరులోనూ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్బీఐ ఆగ్రహానికి గురైంది. నిబంధనలు పాటించకుండా భారీ మొత్తంలో రుణాలు జారీ చేసినందుకు ఆర్బీఐ రూ.4.35 కోట్ల భారీ జరిమానా విధించింది.