మోదీ అధికార నివాసంలో క్రిస్మస్ వేడుకలు

మోదీ అధికార నివాసంలో క్రిస్మస్ వేడుకలు

మోదీ అధికార నివాసంలో క్రిస్మస్ వేడుకలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... చిన్న వయసులో తనకు క్రైస్తవ మతస్తులతో మంచి సంబంధాలు ఉండేవని చెప్పారు. విద్య, వైద్య రంగంలో క్రైస్తవులు ఎన్నో సేవలందిస్తున్నారని కితాబిచ్చారు. పేదలకు సేవ చేయడంలో క్రైస్తవులు ముందుంటారని చెప్పారు. ప్రతి ఒక్కరికి న్యాయం ఉండాలనేదనే ఏసు క్రీస్తు ఆశయమని అన్నారు. దయ, కరుణ, సేవ అనే ఆదర్శాలతో జీవించాడని చెప్పారు. ఉన్నత విలువలు పాటిస్తూ వారసత్వ రక్షణపై మనందరం దృష్టి సారించాలని సూచించారు. సరస్పర సహకారం, సమన్వయంతో అందరం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. 

 క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. 

"క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచడం, అందరినీ సమదృష్టితో చూడడం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దాం" అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

అటు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, క్షమాగుణాలను తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన ఏసు క్రీస్తు జన్మించిన పర్వదినం క్రిస్మస్ అని వివరించారు. 

"ఈ పవిత్ర పండుగ తరుణంలో క్రైస్తవ మత ఆరాధకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సామాజిక విలువలు చైతన్యం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం ఎల్లప్పుడూ ఆచరణీయం. ప్రతి మనిషి ఎంతో కొంత పరోపకార గుణం అలవరుచుకోకపోతే జీవితానికి అర్థం ఉండదని క్రైస్తవం బోధిస్తుంది. ఈ క్రిస్మస్ పర్వదినాన దేశ ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ నా పక్షాన, జనసేన శ్రేణుల తరఫున మనసారా కోరుకుంటున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.