జగ్గంపేట టికెట్ ఇవ్వలేమని చంటిబాబుకు చెప్పిన జగన్
జగ్గంపేట టికెట్ ఇవ్వలేమని చంటిబాబుకు చెప్పిన జగన్
వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 5 లేదా 6న ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు చెపుతున్నారు. ఇప్పటికే టీడీపీ కీలక నేతలతో చర్చలు పూర్తయినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయన టీడీపీలో చేరనున్నారు.
అయితే, జగ్గంపేట టికెట్ ఇవ్వలేమని టీడీపీ పెద్దలు ఆయనకు చెప్పారని, దీంతో, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని తనకు ఇవ్వాలని టీడీపీ నేతలను ఆయన కోరినట్టు సమాచారం. 2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన జ్యోతుల చంటిబాబు ఓటమిపాలయ్యారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఏలేరు ప్రాజెక్ట్ ఛైర్మన్ గా చంద్రబాబు నియమించారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి జ్యోతుల నెహ్రూ రావడంతో... ఆయన వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందారు.