ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం కలిశారు. ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరు కావాలని సీఎంను కోరారు. అలాగే సదస్సు నిర్వహణకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎంతో భేటీ అనంతరం కేఏ పాల్ మాట్లాడుతూ... సదస్సు నిర్వహణకు అనుమతిచ్చే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సదస్సుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, కేంద్రమంత్రులను కూడా ఆహ్వానించామన్నారు. వివిధ దేశాల నుంచి వేలమంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరం బారినపడ్డారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల నుంచి ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంటి వద్ద ఫ్యామిలీ డాక్టర్... రేవంత్ రెడ్డిని పరీక్షించి, మందులిచ్చినట్టు తెలుస్తోంది. నిన్న సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి కాస్త నీరసంగా కనిపించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నుంచి రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లుగా సమాచారం.