ఓటీటీ తెరపైకి వస్తున్న 'మంగళవారం'
ఓటీటీ తెరపైకి వస్తున్న 'మంగళవారం'
పాయల్ రాజ్ పుత్ ప్రధానమైన పాత్రధారిగా 'మంగళవారం' సినిమా రూపొందింది. అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. నవంబర్ 17వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, రిలీజ్ రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత భారీ వసూళ్లను నమోదు చేస్తూ వెళ్లింది.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. నందిత శ్వేత ... దివ్య పిళ్లై .. కృష్ణచైతన్య ముఖ్యమైన పాత్రలను పోషించారు.
గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ ఇది. ప్రతి మంగళవారం ఆ ఊళ్లో ఎవరో ఒకరు చనిపోతుండటం .. అందుకు కారణం కనిపెట్టడానికి ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగడం .. జరుగుతున్న సంఘటనలతో హీరోయిన్ కి సంబంధం ఉండటం అనే ప్రధానమైన అంశాలతో ఈ కథ ముందుకు వెళుతుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.