అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు
అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌ని ఢీకొట్టిన కారు
అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌లోని కారును మరో కారు ఢీకొట్టిన ఘటన కలకలానికి దారి తీసింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం డెలావేర్‌లోని తన క్యాంపెయిన్ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధ్యక్షుడి భద్రత నిమిత్తం కార్యాలయానికి సమీపంలో నిలిపి ఉంచిన ఓ కారును మరో కారు ఢీకొట్టింది. బైడెన్ తిరుగుప్రయాణమయ్యేందుకు కార్యాలయం నుంచి బయటకొచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అప్రమత్తమైన భద్రతా అధికారులు అధ్యక్షుడిని వడివడిగా అక్కడి నుంచి తరలించారు. బైడెన్, ఆయన భార్య సురక్షితంగా ఉన్నట్టు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.