'సలార్'...4 రోజుల్లో నైజామ్ లో 50 కోట్ల షేర్

'సలార్'...4 రోజుల్లో నైజామ్ లో 50 కోట్ల షేర్

'సలార్'...4 రోజుల్లో నైజామ్ లో 50 కోట్ల షేర్

ప్రభాస్ అభిమానులంతా ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా 'సలార్' గురించే మాట్లాడుకుంటున్నారు. అది సొంతం చేసుకుంటున్న రికార్డులను గురించే చెప్పుకుంటున్నారు. వసూళ్ల విషయంలో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.
 
తెలుగు రాష్ట్రాల్లో ఆ జోరు మరింతగా తెలుస్తోంది. నాలుగు రోజుల్లో ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 50 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం. వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా తన హవాను కొనసాగిస్తోంది. జనవరి 1వ తేదీ వరకూ థియేటర్ల దగ్గర ఈ సందడి కనిపిస్తూనే ఉంటుందని అంటున్నారు.

 ఆ రోజు నాటికి ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను టచ్ చేయడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. భారీతనం .. ప్రభాస్ మార్క్ యాక్షన్ సీన్స్ .. 'కేజీఎఫ్'ను పోలిన ప్రశాంత్ నీల్ టేకింగ్ ఈ సినిమాకి ఈ స్థాయి ఆదరణ లభించడానికి కారణమని చెబుతున్నారు.