తేజ సజ్జా హీరోగా రూపొందిన 'హను మాన్'నుంచి రామదూత స్తోత్రం రిలీజ్!
తేజ సజ్జా హీరోగా రూపొందిన 'హను మాన్'నుంచి రామదూత స్తోత్రం రిలీజ్!
తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ 'హను మాన్' సినిమాను రూపొందించాడు. నిరంజన్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. అమృత అయ్యర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ అందుకున్నాయి. అందులో భాగంగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'రామదూత స్తోత్రం'ను విడుదల చేశారు. 'రం రం రం రక్తవర్ణం .. దినకర వదనం' అంటూ ఈ స్తోత్రం మొదలవుతోంది. గౌర హరి సంగీతాన్ని అందించగా, శ్రీచరణ్ .. లోకేశ్వర్ .. హర్షవర్ధన్ ఆలపించారు.
ఈ కథ అంజనాద్రి ప్రాంతంలోని ఒక గ్రామంలో నడుస్తుంది. హనుమ అనుగ్రహం వలన కథానాయకుడికి కొన్ని శక్తులు సొంతమవుతాయి. తన స్వార్థ ప్రయోజనాల కోసం అలాంటి శక్తులను దక్కించుకోవడానికి ప్రతినాయకుడు రంగంలోకి దిగుతాడు. అప్పుడు ఏం జరుగుతుందనేదే కథ.