విశాఖలో చంద్రబాబు, బాలకృష్ణలకు ఘన స్వాగతం
యువగళం సభ కోసం విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్
ఈ సాయంత్రం టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ జరగనుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లిలో ఈ కార్యక్రమం జరగబోతోంది. సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరుకావడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద వీరికి టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు.
యువగళం సభ కోసం విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 18న ముగిసింది. ఈ నేపథ్యంలో, నేడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఈ సభ కోసం ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ విచ్చేశారు. తాజాగా, యువగళం సభలో పాల్గొనేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో ఆయనకు జనసేన శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు కదిలారు. కాసేపట్లో యువగళం-నవశకం సభ ప్రారంభం కానుంది.