బొత్స క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు యత్నించిన నిరుద్యోగులు

బొత్స క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు యత్నించిన నిరుద్యోగులు

బొత్స క్యాంప్ ఆఫీసును ముట్టడించేందుకు యత్నించిన నిరుద్యోగులు

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వానికి కొత్తకొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలు విభాగాలకు చెందిన ఉద్యోగులు, వర్కర్లు వివిధ డిమాండ్లతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా నిరుద్యోగులు రోడ్డెక్కారు. విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిరుద్యోగులు, డీవైఎఫ్ఐ కార్యకర్తలు యత్నించారు. డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.