వాగు పోరంబోకు భూమిని కాపాడు జగనన్నా అంటూ ఫ్లెక్సీ
వాగు పోరంబోకు భూమిని కాపాడు జగనన్నా అంటూ ఫ్లెక్సీ
గుంటూరు జిల్లా నల్లపాడులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. 'అన్నా... జగనన్న... నల్లపాడు గ్రామంలో మీ నాయకులు దోచుకున్న సర్వే నెం. 543, 546, 550లో గల వాగు పోరంబోకు భూమిని కాపాడు అన్నా' అంటూ చల్లా ఆదిరెడ్డి అనే వ్యక్తి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ స్థానికంగా కలకలం రేపుతోంది. నల్లపాడులో క్రీడాజ్యోతిని వెలిగించి... ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
- రంగా వర్ధంతికి పేర్ని నాని రాజకీయ రంగు పులుముతున్నారన్న కొల్లు రవీంద్ర
- ఒక్క రోజైనా రంగా విగ్రహానికి పూలమాల వేశారా అని ప్రశ్న
వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని రాజకీయ రంగు పులుముతున్నారని టీడీపీ నేతల కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో కార్యక్రమం సందర్భంగా రంగా అభిమానులు డీజేకు పర్మిషన్ అడిగితే ఇవ్వరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కొడుకు డీజేతో ఊరంతా తిరిగి రంగా విగ్రహాలకు దండలు వేస్తుంటే కనిపించలేదా అని ప్రశ్నించారు. పేర్ని నాని ఒక్క రోజైనా రంగా విగ్రహానికి పూలమాల వేశారా అని అడిగారు. రంగా మరణం తర్వాత నవకళ సెంటర్ లో ప్రస్తుతం ఉన్న రంగా విగ్రహాన్ని అడ్డుకున్నది మీ నాన్న పేర్ని కృష్ణమూర్తి కాదా? అని ప్రశ్నించారు. రంగా విగ్రహం దిమ్మను మీ తండ్రి తొలగించారని విమర్శించారు. ఈరోజు రంగా పేరుతో రాజకీయం చేయాలనుకోవడం సిగ్గు చేటని అన్నారు.