ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీపై సూపర్ కపుల్ క్యాప్షన్ తో రామ్ చరణ్ ఉపాసన
ఫోర్బ్స్ ఇండియా కవర్ పేజీపై సూపర్ కపుల్ క్యాప్షన్ తో రామ్ చరణ్ ఉపాసన
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్యతో కలిసి ఫోర్బ్స్ మ్యాగజైన్ కు అదిరిపోయే స్టిల్ ఇచ్చారు. ఈ దంపతుల ఫొటోను ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ తన కవర్ పేజీగా ముద్రించింది. కూతురు క్లీంకారాతో కలిసి ముంబైలోని పలు ఆలయాలను సందర్శిస్తున్న ఈ జంట.. శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. షిండే కుటుంబ సభ్యులతో కలిసి దిగిన రామ్ చరణ్, ఉపాసన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక, పింక్ కలర్ అవుట్ ఫిట్స్ లో ఉపాసన సోఫాలో కూర్చోగా.. రామ్ చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చున్న ఫొటోను ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీగా ముద్రించింది. ఈ ఫొటో పక్కన ‘సూపర్ కపుల్. వారిద్దరూ కాలేజీ స్వీట్ హార్ట్స్. ఒకరు వ్యాపారవేత్త, సంఘసంస్కర్త. మరొకరు సూపర్ స్టార్’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ కవర్ పేజీ సోషల్ మీడియాలో వైరలవుతుంది. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్నారు.