న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై పోలీస్ ఆంక్షలు
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై పోలీస్ ఆంక్షలు
న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. వేడుకలను డిసెంబర్ 31 రాత్రి 1 గంట వరకే ముగించాలని ఆదేశించారు. ఈవెంట్ నిర్వహకులు పది రోజుల ముందుగానే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. పోలీసులు పెట్టిన ఆంక్షలు ఇలా ఉన్నాయి.
- ప్రతీ ఈవెంట్ లో సీసీ కెమెరాలు తప్పనిసరి
- ఈవెంట్స్ లో సెక్యూరిటీ తప్పనిసరి
- అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు
- 45 డెసిబుల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్ధం ఉండొద్దు
- కెపాసిటీ మించి పాసులు ఇవ్వొద్దు
- పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి
- సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కల్పించొద్దు
- లిక్కర్ ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదు
- న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు
- సమయానికి మించి లిక్కర్ సరఫరా చేయొద్దు