ఈ గ్రామంలో అందరికీ మతిమరుపు..
ఈ గ్రామంలో అందరికీ మతిమరుపు..
ఈ రోజుల్లో ఏ చిన్న అవసరం తీరాలన్నా డబ్బు కావాలి. దానిని సంపాదించేందుకు జనాలు అనేక మార్గాలను ఎన్నుకుంటారు. కానీ .. ప్రపంచంలో ఓ మారు మూల పల్లెటూరు గ్రామ ప్రజలకు డబ్బంటే ఏమిటో తెలియదట. అంతే కాదండోయ్ ఆ ఊరి ప్రజలందరిని మతిమరుపు వ్యాధి పీడిస్తోందట. మరి డబ్బు లేకుండా ఆ గ్రామ ప్రజలు అవసరాలు ఎలా తీరుతాయో తెలుసుకుందాం. . .
ప్రపంచంలోని అనేక గ్రామాలు, నగరాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనవి, ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి. అదేవిధంగా, నైరుతి ఫ్రాన్స్‌లో ఒక ప్రత్యేకమైన గ్రామం ఉంది. ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తి చిత్తవైకల్యంతో బాధపడుతున్నందున ఈ ఊరు చాలా ప్రత్యేకమైనదిగా వార్తల్లో నిలుస్తుంది. అది ఫ్రాన్స్‌లోని లాండాయిస్ గ్రామం. ఈ గ్రామంలో దాదాపు 120 మంది ఉంటారు. వారికి సమాన సంఖ్యలో ఆరోగ్య నిపుణులు కూడా ఇక్కడే నివసిస్తున్నారు.
విలేజ్ లాండాయిస్.. అనేది ఒక రకమైన ప్రయోగం. అంటే, అల్జీమర్స్‌తో బాధపడేవారిలో ప్రతిదాన్ని గుర్తుంచుకోవడం, ఒత్తిడిని తొలగించడం ద్వారా వ్యాధిని నయం చేయడంలో సహాయపడుతుందనే లక్ష్యంతో.. ఈ గ్రామాన్ని ప్రత్యేకించి ఏర్పాటు చేశారట. ఈ ప్రయోగాన్ని బోర్డియక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం నిర్వహిస్తోంది. దీనికి ప్రొఫెసర్ హెలెన్ అమీవా నాయకత్వం వహిస్తున్నారు. ఆమె ప్రతి ఆరు నెలలకోసారి గ్రామాన్ని సందర్శిస్తూ నివాసితులతో మాట్లాడతారు. వారి వ్యాధి పురోగతిని పర్యవేక్షిస్తుంటారు.. ఇక్కడి ఈ గ్రామంలో షాపింగ్ నుండి పరిశుభ్రత వరకు ప్రతిదానికీ నిర్ణీత సమయం అంటూ ఉండదు.. గ్రామస్థులు వారి సొంత సౌలభ్యం ప్రకారం వారు ఏ పనినైనా చేసుకునేలా స్వేచ్ఛ, స్వాతంత్రం కల్పిస్తారు
ఇక్కడ అత్యంత పెద్ద వ్యక్తికి 102 సంవత్సరాలు, చిన్న వ్యక్తికి 40 సంవత్సరాలు. గ్రామంలోని ప్రధాన కూడలిలో ఒక సాధారణ దుకాణం ఉంటుంది. ఇక్కడ అవసరమైన అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. కానీ, ఇక్కడ ఏ వస్తువుకు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు.. అంటే, ఇక్కడన్నీ ఫ్రీగానే లభిస్తాయి. ఈ గ్రామ నివాసితుల కుటుంబం ఇక్కడ బస చేసినందుకు £24,300 అంటే దాదాపు రూ. 25 లక్షలు చెల్లిస్తుంది. ఇందుకోసం ఫ్రాన్స్ స్థానిక ప్రభుత్వం కూడా రూ.179 కోట్లకు పైగా విరాళం ఇచ్చింది.
ఈ రోజుల్లో ప్రజలు రక రకాల వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలు కలిగి ఉన్నారు. వారు మనస్సులోనే సీక్రెట్ గా కొన్ని విషయాలు ఉంచుకోవాలి. . అటువంటి పరిస్థితిలో, ఏదైనా మర్చిపోవడం పెద్ద విషయం కాదు. అయితే ప్రతి విషయం మర్చిపోతే .. ఈ అలవాటు లేదా మతిమరుపు వ్యాధిగా మారి.. . జీవితంలో చాలా ప్రభావం చూపుతుంది. మతిమరుపుతో బాధపడేవారి కోసం ప్రత్యేకంగా ప్రపంచంలో ఓ గ్రామాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే ఎంత ఆసక్తికరంగా ఉంటుందో ఊహించుకోండి.