‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి అంబటి రాయుడు దూరం
‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి అంబటి రాయుడు దూరం
టీమిండియా మాజీ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు కొంత కాలం క్రితం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఆ భేటీ తర్వాత ఆయన ప్రజలతో మమేకమవడం ప్రారంభించారు. దీంతో, ఆయన వైసీపీలో చేరబోతున్నారని, గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ఈరోజు జగన్ పర్యటన సందర్భంగా అంబటి కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆడుదాం ఆంధ్ర పోటీలను గుంటూరు జిల్లా నల్లపాడులో జగన్ ప్రారంభించారు. క్రీడలకు సంబంధించిన కార్యక్రమం కావడంతో అంబటి రాయుడు తప్పకుండా పాల్గొంటారని అందరూ భావించారు. అయితే, ఆయన రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.