సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీపీఐ నాయకులు
సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీపీఐ నాయకులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సచివాలయంలో సీపీఐ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, ఇతర నేతలు ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలకు మేలు చేసే ప్రతి పనిలో ప్రభుత్వానికి తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని సీపీఐ నాయకులు తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి
సమీక్ష
హైదరాబాద్ మెట్రో రైల్వే లైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాజధాని మెట్రో రైలు పొడిగింపుపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో మార్గం... మియాపూర్ నుంచి రామచంద్రాపురంకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో పొడిగింపు తదితర అంశాలపై నిన్న ఆయన స్పందించారు. ఈ క్రమంలో ఈ రోజు మెట్రో రైలుకు సంబంధించి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సుమన్ భేరి, సభ్యులు వీకే సారస్వత్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు.