ఎయిర్పోర్టులో 10 రూపాయలకే మీల్స్.

ఎయిర్పోర్టులో 10 రూపాయలకే మీల్స్.

ఎయిర్పోర్టులో 10 రూపాయలకే మీల్స్.

ప్రస్తుత రోజుల్లో సామాన్యుడు బయట భోజనం చేయాలంటే రూ.70 నుంచి 200 (ఒక వ్యక్తికే) వరకు ఖర్చు పెట్టాల్సిందే. రోడ్డుపై అమ్మే వాళ్ల దగ్గర కూడా తక్కువలో తక్కువ 50 రూపాయలు ఇచ్చి భోజనం చేయాల్సిందే. చాలా చోట్ల మినీమం ఒక వ్యక్తి తినేందుకు 70 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో పెరిగిన నిత్యవసరాల ధరలతో అన్ని రేట్లు పెరిగాయి. ఇక అసలు విషయానికొస్తే.. కర్నాటక ప్రభుత్వం కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకుంది. 

సామాన్యులు, మధ్యతరగతి, వ్యాపారులు, విలాసవంతమైన వ్యక్తులకు గమ్యస్థానంగా ఉన్న బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అల్పాహారం రూ. 5, మధ్యాహ్న భోజనం రూ.10కే అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బెంగళూరు విమానాశ్రయంలో ఇందిరా క్యాంటీన్‌ను త్వరలోనే ప్రారంభం కానుంది. విమానాశ్రయంలోని పార్కింగ్ ప్రాంతంలో 2 ఇందిరా క్యాంటీన్‌లను ప్రారంభించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

బెంగుళూరు విమానాశ్రయంలో కేవలం 10 రూపాయలకే భోజనం అందించేలా సిద్దరామయ్య సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ‘ఇందిరా క్యాంటీన్’ పేరుతో విమానాశ్రయంలో ప్రారంభించాలని నిర్ణయించింది. బెంగళూరులో ఇప్పటికే 175కి పైగా ఇందిరా క్యాంటీన్‌లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్‌లలో కేవలం రూ. 5కే అల్ఫాహారం, రూ. 10కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇందిరా క్యాంటీన్‌లకు నాణ్యమైన ఆహారం అందడం లేదని.. వాటిని మూసేయాలని ఆలోచన చేశారు. 

అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. సీఎం సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్‌లలో లంచ్, స్నాక్స్ మెనూను మార్చారు. రాగి ముద్ద, మంగళూరు బన్స్‌తో సహా పలు రకాల భోజనాలు వడ్డిస్తున్నారు. ఖరీదైన ఫుడ్ అవుట్‌లెట్లలో కూడా ఇందిరా క్యాంటీన్ లో భోజనం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 

అల్పాహారం మెనూ (రూ. 5 మాత్రమే) :

సాంబారుతో ఇడ్లీ

చట్నీతో ఇడ్లీ

పెరుగు బజ్జీతో వెజ్ పలావ్

ఖరాబత్ చట్నీ

చట్నీతో చౌచౌ బాత్

మంగళూరు బన్స్

సాధారణ బన్స్

జామ్ తో బ్రెడ్

చట్నీతో పొంగల్

బూందీతో బిస్బెలేబాత్

సీజనల్ మామిడి చిత్రాన్న 

లంచ్ మెనూ (రూ. 10) :

వెజిటబుల్ సాంబార్ మరియు ఖీర్ తో అన్నం

తకరారీ సాంబార్ మరియు రైతాతో అన్నం

టమోటా సాంబార్ మరియు పెరుగుతో అన్నం

కూరగాయల రసం మరియు ఖీర్‌తో రాగిముద్దే

సాగు మరియు ఖీర్‌తో చపాతీ

డిన్నర్ మెనూ (రూ. 10) :

వెజిటబుల్ సాంబార్ తో అన్నం

తకరారి సాంబార్ మరియు రైతాతో అన్న

పచ్చిమిర్చి పులుసుతో రాగిముద్దె

వెజ్ గ్రేవీతో చపాతీ