కార్యాలయాలను విశాఖకు తరలించొద్దంటూ రైతుల పిటిషన్లు
కార్యాలయాలను విశాఖకు తరలించొద్దంటూ రైతుల పిటిషన్లు
విశాఖపట్నంకు కార్యాలయాల తరలింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారంటూ రాజధాని ప్రాంత రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులను వెలువరించేంత వరకు చర్యలు తీసుకోబోమని ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.