5 వేల వజ్రాలతో రామమందిరం నెక్లెస్.. రామయ్యకు సూరత్ వ్యాపారి గిఫ్ట్

5 వేల వజ్రాలతో రామమందిరం నెక్లెస్.. రామయ్యకు సూరత్ వ్యాపారి గిఫ్ట్

5 వేల వజ్రాలతో రామమందిరం నెక్లెస్.. రామయ్యకు సూరత్ వ్యాపారి గిఫ్ట్

ఉత్తర ప్రదేశ్ లో నిర్మించిన అయోధ్య రామ మందిరం 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.  ఈ  ప్రారంభోత్సవానికి దాదాపు  నెల ముందే గుజరాత్ సూరత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి రామ మందిరం ఇతివృత్తంపై ఒక వజ్రాల హారం తయారు చేసి తన భక్తిని చాటుకున్నాడు. ఇది ఎంతగానే ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పోలి ఉండే  డైమండ్ నెక్లెస్ కు  2 కిలోల వెండితో పాటు  ఈ నెక్లెస్ డిజైన్‌లో 5 వేల అమెరికన్ వజ్రాలు ఉపయోగించారు. ఈ నెక్లెస్ లో   రాముడు, లక్షణుడు, సీత,హనుమాన్ లను కూడా చూడొచ్చు. ఈ డిజైన్‌ను 40 మంది కళాకారులు  35 రోజుల్లో పూర్తి చేశారు.  ఇది ఏ వాణిజ్య ప్రయోజనం కోసం కాదు... తాము దానిని రామ మందిరానికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాము అని వజ్రాల వ్యాపారి చెప్పాడు. 

అయోధ్య రామాలయానికి అవసరమైన మొత్తం 48 గంటలు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం జోరుగా జరుగుతోంది. జనవరి 22న ఆలయ ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. తమిళనాడులోని నమక్కల్ జిల్లా నుంచి రామమందిరం కోసం గంటలు ఆర్డర్ చేశారు.  అయోధ్య రామాలయానికి అవసరమైన మొత్తం 48 గంటలు, తమిళనాడులోని నామక్కల్‌లో నెల రోజులుగా తయారయ్యాయి. త్వరలోనే ఈ గంటలన్నీ అయోధ్య రామమందిరానికి పంపాలి. శ్రీ ఆండాల్ మోల్డింగ్ వర్క్స్‌కు చెందిన రాజేంద్రన్ వీటిని తయారు చేశారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అయిన ఆయన రామాలయానికి గంటలు సరఫరా చేయబోతున్నారు.

అయోధ్య రామాలయ ట్రస్ట్ వారు ఈ గంటల కోసం నెల కిందట రాజేంద్రన్‌ను సంప్రదించారు. చర్చల తర్వాత గంటల తయారీకి ఆదేశాలతోపాటూ.. ఎలా తయారుచెయ్యాలనే అంశంపై కొన్ని నియమ నిబంధనలను ఇచ్చారు.70 కేజీల బరువున్న గుడి గంటలు 5, అలాగే 60 కేజీల బరువున్న గుడి గంటలు 6, ఇంకా 25 కేజీల బరువున్న ఒక గంట, మొత్తం 12 పెద్ద గంటలు, 36 చిన్న గంటలు తయారు చేయాలని ఆదేశించినట్లు రాజేంద్రన్ తెలిపారు.

నెల రోజులుగా మొత్తం 25 మంది కళాకారులు అహోరాత్రులు శ్రమించి గంటలను పూర్తి చేశారు. రాగి, వెండి, జింక్ వంటి లోహాలను గంటల తయారీకి ఉపయోగించారు. ఈ గంటల మొత్తం బరువు 1,200 కేజీలు.ఈ గంటలను నమక్కల్ ఆంజనేయర్ ఆలయంలో ఉంచి, ట్రక్కుల ద్వారా బెంగళూరుకు పంపిస్తారు. ఈ గంటలన్నింటినీ వాహనాల్లో ఉంచి ముందుగా ఊరేగింపు చేపట్టాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత ఈ గంటలన్నీ అయోధ్య రామ మందిరానికి తరలిస్తారు. రామ మందిరానికి మొత్తం 108 గంటలు అవసరం. మొదటి దశలో 48 గంటలు తయారు చేశారు.


 తమిళనాడులోనే కాకుండా భారతదేశం అంతటా, ఇకా మలేషియా, సింగపూర్, లండన్, ఇతర విదేశాలకు కూడా ఆలయ గంటలు తయారు చేసి పంపిస్తున్నామన్న రాజేంద్రన్.. గత 7 తరాలుగా గంటలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.తక్కువ సమయంలో బెల్స్‌ను అందంగా తయారుచేసేందుకు అవసరమైన సాంకేతికతలు తమ దగ్గర ఉన్నాయని రాజేంద్రన్ తెలిపారు. అయోధ్య రామ మందిరానికి గంటలు తయారు చేయడానికి తాము ఇరోమ్‌ను ఉపయోగించలేదని చెప్పారు. మాకు ఇక్కడ అతిపెద్ద హనుమంతుని ఆలయం ఉంది. నమక్కల్ లోని హనుమంతుని ఆలయం చాలా పెద్దది. ఇక్కడి నుంచి రామాలయానికి గంటలు తయారు చేసి పంపడం మాకు చాలా సంతోషకరమైన విషయం" అని రాజేంద్రన్ తెలిపారు.