సోషల్ మీడియా వేదికగా భార్య శైలిమకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
సోషల్ మీడియా వేదికగా భార్య శైలిమకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన భార్య శైలిమకు సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సాయంత్రం ట్వీట్ చేశారు. నా ప్రియమైన భార్యకు 20వ వివాహ వార్షిక శుభాకాంక్షలు... ఈ రెండు దశాబ్దాలుగా తనకు మద్దతుగా నిలిచినందుకు... తనకు ఇద్దరు అందమైన పిల్లలను అందించినందుకు... అలాగే ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ ప్రయాణం ఇలాగే కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 20 ఏళ్ల క్రితం నాటి పెళ్లి ఫొటోను, తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసిన మరో ఫొటోను షేర్ చేశారు.
తెలంగాణ భవిష్యత్తు కూడా ఇదేనా?: కేటీఆర్
తెలంగాణలో ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని హామీలనూ నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇలాంటి హామీలతోనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాజాగా కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయి. 'డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? ఎన్నికల సమయంలో మేము హామీలు ఇచ్చిన సంగతి నిజమేనప్పా. చెప్పినవన్నీ చేయడం సాధ్యమేనా?' అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ఎన్నికల్లో ప్రజలను సక్సెస్ ఫుల్ గా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని... తెలంగాణ భవిష్యత్తు కూడా ఇదేనా? అని ప్రశ్నించారు. భారీ ప్రకటనలు చేసే ముందు మీరు కనీస అధ్యయనం, ప్లానింగ్ చేయాల్సిన అవసరం లేదా? అని విమర్శించారు.