సమోసాను బ్యాన్ చేసిన సోమాలియా
సమోసాను బ్యాన్ చేసిన సోమాలియా
మన దేశంలో 18 నుంచి 80 ఏళ్ల వరకు ఎవరైనా సరే.. ఎలాంటోళ్లయినా సరే ఇష్టం తినే ఒక ఐటమ్ ఉంది.. అదే సమోస. ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు.. మధ్యాహ్నం లంచ్ లో.. రాత్రి డిన్నర్ లో సమోసా స్పెషల్ ఐటమ్ తినేవారు చాలా మందే ఉన్నారు. సమోసా జిలేజీ కాంబినేషన్ అయితే అదుర్స్ అనుకోండి.. ఇలాంటి సమోసాను.. ప్రపంచంలో బ్యాన్ చేసిన దేశం ఒకటి ఉంది తెలుసా.. అది సోమాలియా దేశం..
కారణం ఏంటీ :
సమోసా అంటే ఇష్టంలేక కాదంట.. సమోసా ఉన్న ఆకారమే సోమాలియా దేశానికి అభ్యంతరకం అంట. సమోసా ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది.. ఈ ట్రయాంగిల్ షేప్ అనేది సోమాలియా ఇస్లామిక్ మతానికి విరుద్ధంగా ఉందంట. క్రైస్తవ మతంలోని హోలీ ట్రినిటీకి సంబంధించిన ఆకారంగా.. సమోసాలు ఉంటున్నాయని గుర్తించిందంట. దీంతో దేశంలో సమోసాను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు సోమాలియా దేశంలోని ఇస్లామిక్ మత పెద్దలు.. దేశంలో ఎవరూ సమోసా తయారు చేయటం లేదా అమ్మటం చేయకూడదని.. సమోసాలను సోమాలియా దేశంలో పూర్తిగా నిషేధి స్తున్నట్లు అక్కడి సున్నీ ఇస్లామిక్ మిలటరీ, రాజకీయ పార్టీ అయిన అల్ షబాబ్ గ్రూప్ ప్రకటించింది.
ఈ నిషేధం ఇప్పుడు చేయలేదండీ.. 2011లోనే జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు అంటారా.. భారతదేశంలో ఇష్టంగా తినే ఆహార పదార్థాలను బ్యాన్ చేసిన దేశాల వివరాలను వెల్లడించటంలో భాగంగా.. మరోసారి తెరపైకి వచ్చింది.