షూటింగు దశలో 'రాజా డీలక్స్' .. ప్రభాస్ జోడీగా మాళవిక మోహనన్
షూటింగు దశలో 'రాజా డీలక్స్' .. ప్రభాస్ జోడీగా మాళవిక మోహనన్
ప్రభాస్ - మారుతి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్ ఈ సినిమాలో కథానాయికగా కనిపించనుంది. హారర్ కామెడీ జోనర్లో ఈ కథ నడవనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగు కొంతవరకూ జరిగింది. 'రాజా డీలక్స్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
అయితే ప్రభాస్ 'సలార్' సినిమా విడుదలైన తరువాతనే, 'రాజా డీలక్స్' సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ను వదలాలని నిర్ణయించుకున్నారు. అందువలన ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్ డేట్ ను బయటికి వదలకుండా వెయిట్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం 'సలార్' భారీ వసూళ్లతో హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అందువలన ఇక 'రాజా డీలక్స్'కి అప్ డేట్స్ అందించడానికి రెడీ అవుతున్నారు.
ఈ సంక్రాంతికి 'రాజా డీలక్స్' గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక అప్పటి నుంచి అప్ డేట్స్ వదులుతూ వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రీసెంటుగా సంజయ్ దత్ కాంబినేషన్లోని ఓ షెడ్యూల్ ను పూర్తిచేశారు. జనవరి 20వ తేదీ నుంచి మరో షెడ్యూల్ మొదలుకానున్నట్టుగా చెబుతున్నారు.