ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న 'హాయ్ నాన్న'
ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న 'హాయ్ నాన్న'
నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' సినిమా, డిసెంబర్ 7వ తేదీన విడుదలైంది. మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ ఇది. నాని జోడీగా మృణాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు కొన్ని కారణాల వలన ఓ భార్య దూరమైపోతుంది. ఆ తరువాత జరిగిన ఒక ప్రమాదం కారణంగా గతాన్ని మరిచిపోయిన ఆమె, తనకి తెలియకుండానే తిరిగి భర్త జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ కథలో ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు దక్కించుకున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా చెబుతూ, ఒక పోస్టర్ ను వదిలారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మరింత రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.