షూటింగు దశలో బాబీ మూవీ .. బాలయ్య 109వ సినిమా
షూటింగు దశలో బాబీ మూవీ .. బాలయ్య 109వ సినిమా
బాలకృష్ణ కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఒకదానికి మించి మరొకటి ఆయన సినిమాలు వసూళ్లు సాధించాయి. ఆయన తాజా చిత్రం బాబీ దర్శకత్వంలో రూపొందుతోంది. సంఖ్యా పరంగా బాలకృష్ణకి ఇది 109వ సినిమా. హ్యాట్రిక్ హిట్ తరువాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో, అందరిలో ఆసక్తి పెరుగుతూ పోతోంది.
ప్రస్తుతం ఈ సినిమా రంపచోడవరం .. మారేడుమిల్లి ఫారెస్టు ప్రాంతంలో షూటింగు జరుగుపుకుంటోంది. బాలయ్యతో పాటు ప్రధానమైన తారాగణం పాల్గొనగా కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఇక్కడే చిత్రీకరణ జరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారట.
ఈ సినిమాలో బాలయ్య సరసన నాయికలుగా ఊర్వశి రౌతేలా .. మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఇక బాలయ్య ఓల్డ్ లుక్ కి సంబంధించిన పాత్ర సరసన నాయికగా ముందుగా 'త్రిష' పేరు వినిపించింది. ప్రియమణిని తీసుకున్నారనే వార్త రీసెంటుగా వినిపించింది. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా కనిపించనుంది.