మోదీపై ప్రియాంకను పోటీలో నిలపాలన్న మమత .. ప్రియాంక స్థానంలో మమత పోటీ చేయాలన్న అగ్నిమిత్ర

మోదీపై ప్రియాంకను పోటీలో నిలపాలన్న మమత .. ప్రియాంక స్థానంలో మమత పోటీ చేయాలన్న అగ్నిమిత్ర

మోదీపై ప్రియాంకను పోటీలో నిలపాలన్న మమత ..  ప్రియాంక స్థానంలో మమత పోటీ చేయాలన్న అగ్నిమిత్ర

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దమ్ముంటే ప్రధాని మోదీపై పోటీ చేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకురాలు అగ్నిమిత్ర పాల్ సవాల్ విసిరారు. ఇండియా కూటమి నాలుగో సమావేశం సందర్భంగా... వారణాసిలో మోదీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ పోటీ చేయాలని మమతా బెనర్జీ సూచించిన నేపథ్యంలో ఆమె ఈ మేరకు ఛాలెంజ్ చేశారు. ప్రియాంకాగాంధీ స్థానంలో మీరు పోటీ చేయాలని సవాల్ విసిరారు. మీరు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు కదా అని ప్రశ్నించిన అగ్నిమిత్ర... అలాంటప్పుడు ప్రధానిపై పోటీ చేయాలని అన్నారు.