మెల్బోర్న్ లో ఆసీస్-పాక్ రెండో టెస్టు..హసన్ అలీ డ్యాన్స్ తో హోరెత్తిన ఎంసీజీ
మెల్బోర్న్ లో ఆసీస్-పాక్ రెండో టెస్టు..హసన్ అలీ డ్యాన్స్ తో హోరెత్తిన ఎంసీజీ
మెల్బోర్న్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఆటకు నేడు మూడో రోజు కాగా, స్టేడియంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న పాక్ పేసర్ హసన్ అలీ సరదాగా ప్రేక్షకులతో డ్యాన్స్ చేయించాడు. హసన్ అలీ ఎలా చేస్తే, ప్రేక్షకులు కూడా అలాగే చేశారు. ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాదు, ఈ మాస్ డ్యాన్స్ తో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న, ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కూడా బౌండరీ వద్ద ఇలాగే ప్రేక్షకులను అలరించాడు.