ప్రధాని మోదీతో, కరణ్ అదానీతో రేవంత్ రెడ్డి సమావేశాలు
ప్రధాని మోదీతో, కరణ్ అదానీతో రేవంత్ రెడ్డి సమావేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ ముఖ్యమంత్రి? అంటూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీ-ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. పెట్టుబడుల సమీకరణలో భాగంగా నిన్న గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిశారు. వీటికి సంబంధించి 'మీటింగ్ విత్ ప్రధాని-బిజినెస్ విత్ అదానీ' అని క్యాప్షన్ పెట్టి... ప్రధాని మోదీతో, కరణ్ అదానీతో రేవంత్ రెడ్డి ఉన్న ఫొటోలను క్రిషాంక్ ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ రీట్వీట్ చేస్తూ... బీజేపీ ముఖ్యమంత్రా? లేక కాంగ్రెస్ ముఖ్యమంత్రా? అని చురక అంటించారు.