ప్రచారంలో దూసుకెళ్తున్న వివేక్ రామస్వామి
ప్రచారంలో దూసుకెళ్తున్న వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడేందుకు ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిపబ్లిక్ పార్టీ తరఫున ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ రేసులో ఉన్న రామస్వామి.. పోయిన వారం మొత్తం 42 క్యాంపెయిన్ ఈవెంట్లలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘లాస్ట్ వీక్ మొత్తం అయోవా స్టేట్‌లోనే ప్రచారం చేశాను. రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి నేనే సరైన వ్యక్తినని ఓటర్లకు వివరిస్తున్న. ఈ పోల్స్‌లో నేను 50 పాయింట్ల ఆధిక్యంలో ఉన్న. వారంలో 42 క్యాంపెయిన్ ఈవెంట్స్‌లో పాల్గొన్న. నా తల్లిదండ్రుల నుంచే ఎన్నో పాఠాలు నేర్చుకున్న.. అవే నన్ను ఇప్పుడు ఈ స్థాయిలో ఉంచాయి’’ అని వివేక్ తెలిపారు. తన అదృష్టం అంతా ‘వర్క్’లో ఉందని వివరించారు. ‘వర్క్’ అనేది తన జీవితంలోని ప్రధాన సూత్రమని వివేక్ రామస్వామి చెప్పారు.