నిన్నటితో 17 రోజులను పూర్తి చేసుకున్న 'యానిమల్' సినిమా ..835.9 కోట్ల గ్రాస్ వసూలు
నిన్నటితో 17 రోజులను పూర్తి చేసుకున్న 'యానిమల్' సినిమా ..835.9 కోట్ల గ్రాస్ వసూలు
రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' సినిమాను రూపొందించాడు. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా, భారీ బడ్జెట్ తో .. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 1వ తేదీన విడుదలైన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
నిన్నటితో ఈ సినిమా 17 రోజులను పూర్తి చేసుకుంది. ఈ 17 రోజుల్లో ఈ సినిమా 835.9 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉందనీ .. అక్కడక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయనే టాక్ పబ్లిక్ వైపు నుంచి వినిపించింది. ఆ టాక్ ను దాటుకుని మరీ ఈ సినిమా ముందుకు వెళుతుండటం విశేషం.
తండ్రీ కొడుకుల ఎమోషన్స్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. తన తండ్రి పట్ల గల ప్రేమతో ఎంతకి తెగించడానికైనా సిద్ధపడే ఓ కొడుకు కథ ఇది. రష్మిక పాత్రకి కూడా మంచి ప్రాధాన్యత ఉంది. అనిల్ కపూర్ .. బాబీ డియోల్ వంటి బలమైన తారాగణం ఈ సినిమాకి మంచి హెల్ప్ అయింది. చూడాలి మరి ఈ సినిమా వసూళ్లు ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతాయో.