టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పు 169 శాతం పెరిగిందన్న విజయసాయిరెడ్డి

టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పు 169 శాతం పెరిగిందన్న విజయసాయిరెడ్డి

టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పు 169 శాతం పెరిగిందన్న విజయసాయిరెడ్డి

టీడీపీ హయాంలో రాష్ట్ర అప్పు 169 శాతం పెరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఏడాదికి 12.07 శాతం చొప్పున అప్పులు పెరిగాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పులు 55 శాతానికి తగ్గాయని తెలిపారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చేందుకు టీడీపీ ప్రభుత్వం డబ్బును ఖర్చు చేసిందని విమర్శించారు. పేద ప్రజలకు లబ్ధి చేకూరేలా, వారి కలలు సాకారమయ్యేలా ముఖ్యమంత్రి జగన్ డబ్బును వినియోగిస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఇదేనని అన్నారు.

 

అంబటి రాంబాబు వ్యంగ్యం

యువగళం పాదయాత్ర సందర్భంగా కొందరు అధికారులు, పోలీసుల పేర్లను నారా లోకేశ్ ఓ ఎర్ర పుస్తకంలో రాసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 

"ఎర్ర బుక్ అంట. అందులో పేర్లు రాసుకున్నాడంట. ఆ బుక్ ఒరిజినల్ కాపీని వాళ్ల నాన్న గారికి ఇస్తాడంట... ఒక కాపీ తన వద్ద ఉంచుకుంటాడంట. ఇంకో కాపీ ఆ యాంకర్ కు కూడా ఇవ్వవయ్యా! పవన్ కల్యాణ్ యాంకర్ గా వస్తున్నాడు కదా... ఆయనకు కూడా ఇస్తే బాగుంటుంది! ఆయన కూడా నీ భాగస్వామే అన్నావుగా! 

నీ దుంపతెగ... తెలుగుదేశం పార్టీ  తెల్లజెండా ఎత్తేంత వరకు మన లోకేశ్ బాబు నిద్రపోయేట్టు లేడు! తెల్లజెండా ఎత్తిన తర్వాతే ఆయన నిద్రపోతాడు! నేను ఎప్పుడో చెప్పాను... లోకేశ్ బాబు ఒక ఐరన్ లెగ్. అతడు కాలు పెట్టాడు... తెలుగుదేశం కుంగింది... యువగళం పాదయాత్ర చేశాడు... తెలుగుదేశం ఇంకా కుంగింది" అంటూ ఎద్దేవా చేశారు. 

అంతేకాదు, చంద్రబాబు భలే యాంకర్లను సెట్ చేశాడంటూ అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించారు.