చిన్నారికి 'రాజశేఖర్' అని నామకరణం చేసిన సీఎం జగన్
చిన్నారికి 'రాజశేఖర్' అని నామకరణం చేసిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ భీమవరంలో పర్యటించిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చిట్టూరి సోనీ, చిట్టూరి మోహన్ కుమార్ తమ ఐదు నెలల బిడ్డను తీసుకుని సీఎం జగన్ వద్దకు వచ్చారు. తమ బిడ్డకు పేరు పెట్టాలని సీఎంను కోరారు. ఆ దంపతులతో ఆప్యాయంగా మాట్లాడిన సీఎం జగన్ వారి బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడారు. "ఏం పేరు పెడదాం?" అంటూ కాసేపు ఆ చిన్నారిని లాలించి... "నాన్న పేరు పెడదాం" అంటూ 'రాజశేఖర్' అని నామకరణం చేశారు. దాంతో సోనీ, మోహన్ కుమార్ దంపతుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.