గోవాలోని క్లబ్బులు, పబ్బుల పై ఐటీ పంజా
గోవాలోని క్లబ్బులు, పబ్బుల పై ఐటీ పంజా
గోవాలోని పబ్బులు, బార్ల పై ఐటీ శాఖ అధికారులు పంజా విసిరారు. నూతన సంవత్సరం సందర్భంగా గోవాలోని ప్రముఖ నైట్ క్లబ్బులు, పబ్బులు, బార్లు, డైనింగ్ రెస్టారెంట్లు పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అనుమానంతో దాడులు చేశారు. టిట్లీ క్యులినరీ బార్, వాగేటర్, సియోలిమ్, మోర్జిమ్‌లోని, గ్రీక్ టావెర్న్ తలస్సా, సన్డౌన్ బార్, రోమియో లేన్, హామర్జ్, కలంగుట్ వంటి క్లబ్ లు, పబ్బులు, బార్లు, డైనింగ్ రెస్టారెంట్ల పై దాడులు చేశారు.
తలస్సా రెస్టారెంట్ నడుపుతున్న స్పిరో గ్రానా, మరియు రోమియో లేన్ రెస్టారెంట్ నడుపుతున్న సౌరభ్ లూథ్రా మరియు గౌరవ్ లూథ్రాతో సహా దాదాపు 60 మంది పై ఐటీ శాఖ అధికారులు దాడి చేశారు. దాడుల పై ఐటీ శాఖ స్పందిస్తూ చాలా నైట్‌క్లబ్‌లు మరియు బార్లు ఆదాయాన్ని తక్కువగా చూపించాయని మరియు సరైన రిజిస్ట్రేషన్స్ చేయలేదని తెలిసిందని అన్నారు.
దీపావళి, క్రిస్మస్ మరియు నూతన సంవత్సరానికి గోవాను సందర్శించే రికార్డు సంఖ్యలో పర్యాటకులతో హాస్పిటాలిటీ వ్యాపారం పుంజుకుందని అయితే పన్ను రిటర్న్‌లు ఉత్పత్తి చేయబడిన వ్యాపారంతో సరిపోలడం లేదని చెప్పారు. ఈ దాడులు ఉత్తర గోవాలోని నైట్‌క్లబ్‌లు, బార్లు మరియు రెస్టారెంట్లలో పండగ ఉత్సాహంను దెబ్బ తీశాయని స్థానికులు చెబుతున్నారు.