హల్వాద్ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ టేకోవర్ చేసిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్
హల్వాద్ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ టేకోవర్ చేసిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్
భారత్ లో అదానీ గ్రూప్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు వ్యాపారాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ తాజాగా మరో కంపెనీని సొంతం చేసుకుంది. హల్వాద్ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ లో 100 శాతం వాటాను కొనుగోలు చేసుకుంది. హల్వాద్ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ - అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ లు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కంపెనీ టేకోవర్ కు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు దాదాపు 3 శాతం పెరిగాయి.
టారిఫ్ బేస్డ్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అదానీ గ్రూప్ ఈ ప్రాజెక్టును సొంతం చేసుకుంది. సుమారు 301 కిలోమీటర్ల మేర ట్రాన్స్ మిషన్ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దాదాపు రూ. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టులో 765 కిలోవాట్ల హల్వాద్ స్విచ్చింగ్ స్టేషన్ నిర్మాణం కూడా ఉంటుంది.