'గీతాంజలి మళ్లీ వచ్చింది'
'గీతాంజలి మళ్లీ వచ్చింది'
అంజలి ప్రధానమైన పాత్రను పోషించిన 'గీతాంజలి' సినిమా, 2014లో థియేటర్లకు వచ్చింది. ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకి, రాజ్ కిరణ్ దర్శకత్వం వహించాడు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా, హారర్ కామెడీ జోనర్లో ప్రేక్షకులను పలకరించింది. చాలా తక్కువ బడ్జెట్ లో భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా అది.
ఆ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుందనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. అందుకు తగినట్టుగానే ఆ సినిమాకి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' రూపొందుతోంది. కోన - జేవీ - ఎంవీవీ సత్యనారాయణ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు.
ఈ సినిమా నుంచి త్వరలో ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. అంజలికి ఇది 50వ సినిమా కావడం విశేషం. తాను ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమాలలో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ఇదే కావడం మరో ప్రత్యేకత. ఈ సినిమాతో దర్శకుడిగా శివ తుర్లపాటి పరిచయమవుతున్నాడు.