క్రిస్మస్ వేడుకల్లో చరణ్, అల్లు, మెగా హీరోలు .. క్లీంకారను కూడా తీసుకొచ్చిన చరణ్, ఉపాసన
క్రిస్మస్ వేడుకల్లో చరణ్, అల్లు, మెగా హీరోలు .. క్లీంకారను కూడా తీసుకొచ్చిన చరణ్, ఉపాసన
మెగా, అల్లు, రామ్ చరణ్ ఫ్యామిలీలు క్రిస్మస్ వేడుకలను కలిసి ఘనంగా జరుపుకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు వెంకట్, ఉపాసన, లావణ్య త్రిపాఠి, కొణిదెల నిహారిక, స్నేహారెడ్డి తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. చరణ్, ఉపాసనల ముద్దుల తనయ క్లీంకారను కూడా సెలబ్రేషన్స్ కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ కూతురుతో దిగిన ఫొటోను ఉపాసన షేర్ చేశారు. 'బెస్ట్ డాడ్' అంటూ క్యాప్షన్ పెట్టారు.