సన్ బర్న్ నిర్వాహకుడు సుమంత్‌పై కేసు నమోదు
సన్ బర్న్ నిర్వాహకుడు సుమంత్‌పై కేసు నమోదు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నిర్వహించతలపెట్టిన సన్ బర్న్ కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించి బుక్ మై షోలో టిక్కెట్ల విక్రయాలు నిలిపివేశారు. దీనికి సంబంధించి ఈవెంట్ నిర్వాహకుడు సుమంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో అనుమతులు లేకుండానే టిక్కెట్లను విక్రయించినందుకు గానూ బుక్ మై షో, నోడల్ అధికారులకు నోటీసులు ఇచ్చారు.
సన్ బర్న్ ఈవెంట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, పోలీసులు అనుమతులు నిరాకరించడంతో నిర్వాహకులు దానిని రద్దు చేశారు. దీంతో బుక్ మై షోలో 'సన్ బర్న్ షో హైదరాబాద్' ఈవెంట్ కనిపించడం లేదు. విశాఖ వేదికగా జరగబోయే సన్ బర్న్ ఈవెంట్ టిక్కెట్లు మాత్రం అమ్ముడవుతున్నాయి.
సన్ బర్న్ భారీ సంగీత వేడుక. పలు రాష్ట్రాల్లో ఈ ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లలోకి మద్యం అనుమతి ఉంటుంది. అయితే అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది