కమిషన్ రేటు పెంచాలని రేపటి నుంచి పెట్రోల్ ట్యాంకర్ యజమానుల సమ్మె

కమిషన్ రేటు పెంచాలని రేపటి నుంచి పెట్రోల్ ట్యాంకర్ యజమానుల సమ్మె

కమిషన్ రేటు పెంచాలని రేపటి నుంచి పెట్రోల్ ట్యాంకర్ యజమానుల సమ్మె

హైదరాబాద్‌లోని పలు పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కమిషన్ రేటు పెంచాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి పెట్రోల్ ట్యాంకర్ యజమానులు సమ్మె చేయనున్నారు. ఈ నేపథ్యంలో బంకులలో పెట్రోల్, డీజిల్ లేదంటూ ఇప్పుడే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రేపటి నుంచి... సమ్మె విషయం తెలిసిన వాహనదారులు ఫుల్ ట్యాంక్ కొట్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు వరుస కడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చే పెట్రోల్ బంకులు పెరిగే అవకాశముంది.