కంగనా వైమానిక దళ పైలట్ గా 'తేజస్'
కంగనా వైమానిక దళ పైలట్ గా 'తేజస్'
బాలీవుడ్ లో నాయిక ప్రధానమైన పాత్రలను పోషించే అతి తక్కువమంది కథానాయికలలో కంగనా రనౌత్ ఒకరు. ప్రధానమైన పాత్రధారిగా, సర్వేశ్ మేవారా 'తేజస్' సినిమాను రూపొందించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, అక్టోబర్ 27వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది.
అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5వారు దక్కించుకున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఒక పోస్టర్ ను వదిలారు. 2016లో భారత వైమానిక దళంలో మొదటిసారిగా మహిళలకు ప్రవేశాన్ని కల్పించిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
భారతీయ వైమానిక దళానికి చెందిన మహిళా పైలట్ గా కంగనా రనౌత్ కనిపిస్తుంది. పాకిస్థాన్ కి సంబంధించిన ఒక సీక్రెట్ ఆపరేషన్ లో పాల్గొనే పైలట్ గా ఆమె పాత్ర కొనసాగుతుంది. కంగనా లుక్ .. ఆమె నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తాయి. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి.