ఎస్సార్ నగర్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పట్టివేత
ఎస్సార్ నగర్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ లో భారీగా మొత్తంలో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్స్ పిల్స్ ను యువకులు తీసుకువచ్చారు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో పార్టీ చేసుకుంటుండగా నార్కోటిక్ బ్యూరో పోలీసులు డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు సాఫ్టువేర్ ఉద్యోగులను కూడా అరెస్ట్ చేశారు.
ప్రేమ్ చంద్ బర్త్ డే కోసం గోవా నుంచి సంపత్ అనే స్నేహితుడు డ్రగ్స్ తెప్పించాడని పోలీసులు తెలిపారు. 30 మంది కోసం డ్రగ్ పార్టీని ప్రేమ్ చంద్ ఏర్పాటు చేశాడని... ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీలో వీళ్లంతా కలసి పనిచేస్తున్నారని వివరించారు. అయితే పట్టుబడిన వారంతా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని తెలిపారు.