ఇన్ స్టాలో అభిమానులతో సామ్ చిట్ చాట్
ఇన్ స్టాలో అభిమానులతో సామ్ చిట్ చాట్
నాగచైతన్యతో విడాకుల తర్వాత సినిమాలతో బిజీబిజీగా ఉన్న సమంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. విదేశాలలో చికిత్స తర్వాత కోలుకుంటున్న ఈ స్టార్ హీరోయిన్ కు తాజాగా ఓ నెటిజన్ నుంచి రెండో పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. వీకెండ్ సందర్భంగా ‘ఆస్క్ మీ’ అంటూ సమంత సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ‘మీరు మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోకూడదు ?’ అంటూ ఓ అభిమాని ప్రశ్నించగా.. సామ్ వెరైటీగా జవాబిచ్చింది. 2023 లో విడాకుల వివరాలను కోట్ చేస్తూ.. రెండో పెళ్లి అనేది బ్యాడ్ ఇన్వెస్ట్ మెంట్ అని చెప్పింది.
కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అంటూ సమంత ఓ ఇమేజ్ తో అభిమానికి జవాబిచ్చింది. అధికారిక గణాంకాల ప్రకారం.. మొదటి పెళ్లి విడాకుల శాతం 50.. రెండు, మూడో పెళ్లి చేసుకున్న వారిలో వరుసగా 67 శాతం, 73 శాతం మంది మళ్లీ విడిపోతున్నారని పేర్కొంది. స్త్రీ పురుషులు ఇద్దరి విషయంలోనూ ఇలాగే ఉందని సామ్ చెప్పింది. అందుకే, ఆ ఆలోచన బ్యాడ్ ఇన్వెస్ట్ మెంట్ కిందికి వస్తుందని వివరించింది. మరో అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబుగా.. తనకు దేవుడిపై నమ్మకం ఉందని సామ్ తెలిపింది. ‘మీ రోజువారీ దినచర్యలోనే మీ విజయ రహస్యం దాగి ఉంటుంది’ అని కోట్ చేసింది. కాగా, సామ్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించిన శ్రీసత్య
'బిగ్ బాస్' సీజన్ 6లో లుక్ పరంగా .. యాక్టివ్ గా ఉండటం పరంగా శ్రీ సత్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో చికెన్ కావాలంటూ ఆమె చేసిన అల్లరి ప్రేక్షకులకు ఇంకా గుర్తుంది. ఆ తరువాత శ్రీసత్య కొన్ని టీవీ షోస్ లో సందడి చేసింది. ఈ మధ్య కాలంలో మాత్రం, ఆమె టీవీల్లో కనిపించడం లేదు.
తాజా ఇంటర్వ్యూలో శ్రీ సత్య మాట్లాడుతూ .. " గతంలో నేను సీరియల్స్ లో చేశాను .. అలాగే టీవీ షోస్ లో కనిపించాను. కానీ ఆ తరువాత ఇక సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నాను. అందువలన కొంతకాలం పాటు బుల్లితెరకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని, సినిమా అవకాశాలపైనే దృష్టి పెట్టాను" అని అంది.
"ఈ మధ్య కాలంలో నేను సినిమాలతో కాస్త బిజీగా ఉన్నాను. 'డీజే టిల్లు 2'లో ఉన్నాను. రీసెంటుగా ఆ షూటింగు పూర్తయింది. త్వరలో ఒక సినిమా షూటింగు కారణంగా అమెరికా వెళ్లబోతున్నాను. వేరే ప్రాజెక్టులపై సైన్ చేసి ఉన్నాను. కొత్తగా కథలు కూడా వింటున్నాను. నన్ను నేను పెద్ద స్క్రీన్ పై చూసుకోవాలని అనుకుంటున్నాను .. అందుకే పూర్తి ఫోకస్ అటు వైపే పెట్టాను" అని చెప్పింది.